విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
సాగునీరు అందక ఎండిపోతున్న వరి పొలాలు
మండలంలోని శివారు భూములకు సాగునీరు అందక చాలా భూములు బీటలు వారి ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదని ఇలాంటి ఇబ్బందులు రైతులకు ఎదురవుతున్నాయని పలు రైతులు వాపోయారు. ఎన్ని ధర్నాలు చేసిన ఎన్ని వినతి పత్రాలు సమర్పించిన ఒకసారి దర్శించడం నిరుస్తామని చెప్పి హామీ ఇచ్చి వెళ్లిపోవడం తప్ప తర్వాత అన్ని మామూలే రైతుల ఆవేదన. మండలంలో 10,400 ఎకరాల్లో వరి సాగు అయితే చొల్లంగి, కోరింగ, పి మల్లవరం గ్రామాల్లో సుమారు 3000 ఎకరాలకు నీరు రావడంలేదని రైతులు చెబుతున్నారు. మనం తినే తిండి కొరకు రైతు ఇంత శ్రమించి పంట వేసిన తగిన సమయంలో నీరు లేక ఇబ్బంది పడుతున్న రైతు కష్టాలను ప్రభుత్వం చూడాలని తగిన ప్రత్యామ్నాయం శాశ్వత పరిష్కారంగా చూడాలని కోరుతున్నారు. కాలువలు, డ్రైన్లు ఆధునీకరణ పూడిక తీత చేపట్టకపోవడం వల్ల ఈ దుస్థితికి ఇది ఒక కారణమని అధికారులు సాగునీటి కష్టాలను శ్రద్ధతో ఈ పూడికతీత పనులు కాలువలు ఆధునీకరణ ఇరిగేషన్ వారు చేయించి రైతులకు సకాలంలో సక్రమంగా సాగుకు నీరు అందించాలని వారు అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు.