WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

*విద్యార్థి దశలోనే హక్కుల పై అవగాహనా పెంచుకోవలి*

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

*ఫార సంస్థల ఆధ్వర్యంలో నీవహించిన బాలలహక్కుల అవగాహనా సదస్సు కార్యక్రమం*

*ముఖ్య అతదిగా పాల్గొన్న బండారు సత్యనందరావు*

విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు . రావులపాలెం పారా సంస్థలో శనివారం హక్కుల పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో బండారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు . తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం పారా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు . హక్కులపై ఆలోచన రేకెత్తిస్తేనే పోరాడే తత్వం వస్తుందన్నారు . బాలల హక్కులు ఏమిటి , వాటికి భంగం కలిగితే ఏ విధంగా కాపాడుకోవాలి అనేది తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలన్నారు . బాల్య వివాహాలు , బాల్యంలో విద్యకు దూరమవుతున్న పిల్లలు , పాఠశాలల్లో బాలలకు మౌళిక సదుపాయాలు లేకపోవడంవిద్యార్థి దశలోనే హక్కులపై అవగాహన పెంచుకోవాలి తదితర అంశాల్లో మార్పు రావాలన్నారు . చిన్న వయసులోనే హక్కుల పట్ల అవగాహన పెంచుకోవాలని , ఆ దిశగా పారా చేస్తున్న ప్రయత్నం స్పూర్తి దాయకం అన్నారు . ఈ సదస్సులో బాలలు తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో కృషి చేస్తానని భరోసా ఇచ్చారు . జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి ( డి.సి.పి.ఓ ) వెంకట్ , ప్రభాకర్ , మార్టిన్ సుధాకర్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి సూచనలతో పారా సంస్థ పాఠశాలల్లో మానవ హక్కుల క్లబ్బులు ఏర్పాటు చేసి బాలలను భాగస్వాములను చేసామన్నారు . నియోజకవర్గంలో ఈ విధంగా 40 పాఠశాలల్లో క్లబ్బులు ఏర్పాటు చేసామని , చదువు మధ్యలో ఆపేసిన 62 మంది పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించామన్నారు . మంచి సమాజం నిర్మాణం కోసం బాలల హక్కుల పరిరక్షణ అత్యవసరం అన్నారు . చదువు , క్రమశిక్షణతో పాటు హక్కులపై అవగాహన కూడా ఉండాలని సూచించారు . దాని కోసం పారా సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లో ఏడు , తెలంగాణాలో ఐదు జిల్లాల్లో ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తోందని చెప్పారు . ఈ సందర్భంగా బాల్య వివాహాలు , బాలికల సమస్యలపై విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆలోచింపజేసింది . అలాగే పలువురు బాలలు తమ దృష్టికి వచ్చిన , ఎదుర్కొంటున్న సమస్యలు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి , సి.డబ్ల్యూ.సి మెంబర్ సంతోషి కుమారి , బడుగు సుబ్బాయమ్మ , హెచ్.ఆర్.సి కో ఆర్డినేటర్లు రమేష్ , దుర్గ , జగదీష్ , రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement