విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామంలో నాన్నకువ జోన్ లో ఉన్న పొలాలను ఆక్వా జోన్లోకి మార్పు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన గ్రామసభలో రైతుల మధ్య వాగ్వివాదం జరిగే సవరసాభాసుగా మారింది. కోరంగి సర్పంచ్ పేజీలమంగేష్ అధ్యక్షతన ఆక్వా జోన్ పై గ్రామ సభ జరిగింది. పాత కోరంగిలో తమ పొలాలను సర్వే నెంబర్లు ఆక్వాజోన్లో పెట్టవద్దని కొందరు రైతులు అభ్యంతరాలు చేయగా మరికొందరు రైతులు ఆక్వాజోన్లో తమ భూములను పెట్టాలని కోరడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగే ఘర్షణలకు దారితీసింది. పి మల్లవరం ఇంజరం గ్రామాల్లో ఆక్వా జోన్ గ్రామసభలు జరిగాయి అభ్యంతరాలను పరిశీలించి కలెక్టర్ కు నివేదిక ఇవ్వనున్నట్లు తహసిల్దార్ పోతురాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత రైతులు మత్స్య శాఖ అధికారి గోపి, వ్యవసాయ అధికారి ప్రశాంతి పాల్గొన్నారు.