విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
పేకాట శిబిరంపై పోలీసులు దాడి
తాళ్ళరేవు మండల పరిధి పెంకె వారి పేటలో కోరంగి పోలీసులకు అందిన సమాచారం మేరకు పెంకె వారి పేటలో నలుగురు వ్యక్తులు జూదం పేకాట ఆడుతున్న సమయంలో కోరింగ పోలీసులు ఆకస్మిక దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో వారి వద్ద నుండి 1500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు కోరింగ ఎస్సై శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఏ ప్రాంతంలో కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జూద కార్యకలాపాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. ఈ దాడిలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కుమార్ కోరంగి సిబ్బంది ఉన్నారు.