విశ్వంవాయిస్ న్యూస్, జగ్గంపేట:
సైన్స్ ప్రతి ఒక్కరి జీవితంతోను ముడిపడి ఉందని, మనిషి దైనందిక జీవితంలో సైన్స్ ఒక భాగమని, అందుకని ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పధాన్ని అలవరచుకోవాలని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఒమ్మి రఘురామ్ అన్నారు. జాతీయ సైన్సు దినోత్సవం పురస్కహరించుకొని మంగళవారం కళాశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రఘురామ్ మాట్లాడుతూ సైన్సు అభివృద్ధి చెందడం వలన ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నో నూతన ఆవిష్కరణలు, కొత్త విషయాలు కనుగొనడం జరిగిందన్నారు. సైన్స్ ప్రపంచ శ్రేయస్సును ఉపయోగపడేదిలా ఉండాలే కానీ వినాసనానికి దారి తీయకూడదన్నారు. సైన్సులో ఎంతైనా అభివృద్ధి సాధించొచ్చని కానీ ఆ అభివృద్ధి ప్రకృతిని పడుచేసేదిలా ఉండకూడదు అన్నారు.ప్రకృతి కోపాన్ని ఏ సైన్స్ అపలేదని అన్నారు అందుకని ప్రకృతిని కాపాడుకుంటూ సైన్సు ను అభివృద్ధిలో ఉపయోగిం చాలన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత భారత రత్న సర్ సి వి రామన్ గారు కనిపెట్టిన రామన్ ఎఫర్ట్ కనుగొన్న రోజు ఫిబ్రవరి 28 అని అందుకని 1987 సంవత్సరం నుండి ఈ జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. మరో అతిధి కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ మాట్లాడుతూ భారత్ జి 20 దేశాలలో స్థానం సంపాదించింది అన్నారు. విద్యార్థులు సైన్స్ వలన చాలా లబ్ది పొందుతారన్నారు. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్సు ద్వారా ప్రపంచీకరణకు సాధ్యమైందని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్సిబిషన్ లో చాలా సైన్స్ సంబంధిత ప్రదర్శనలు అతిధులు, విద్యార్థులు వీక్షించారు. ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సాహితీ వర్మ, జనవిజ్ఞాన వేదిక వర్మ, వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సైన్సు అధ్యాపకులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు