విశ్వంవాయిస్ న్యూస్, జగ్గంపేట:
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జగ్గంపేటలో భాష్యం పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రూపొందించబడిన సైన్స్ ప్రాజెక్ట్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కుసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ సైన్స్ జీవితంలో ఒక భాగం అని, ప్రతి ఒక్కరూ సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి. రామన్ 1987 ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారని ఆనాటి నుండి ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలియజేశారు. సైన్స్ అభివృద్ధి చెందడం వలన ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందిందని ఎన్నో నూతన ఆవిష్కరణ కొత్త విషయాలు కనుగొనడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపాల్ కె వాణి ,సత్య శ్రీ ,ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.