విశ్వంవాయిస్ న్యూస్, జగ్గంపేట:
ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని వారి స్వగృహంలో కలవడం జరిగింది. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకుని ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాతో మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతీ ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని అదే సందర్భంలో పార్టీ విధానాలను దిక్కరిస్తూ లైన్ దాటితే ఎంతటివారినైనా పార్టీ ఉపేక్షిచందని దేనికైనా సరైన సమయం సందర్భంలో తగు చర్యలు ఉంటాయని మీరు పార్టీ మనుషులు మీ వెనుక పార్టీ ఎపుడూ ఉంటుందని పార్టీ కార్యకర్తలు కష్టం గుర్తించడంలో మీ వెనుక నేనుంటానని మనోహర్ చెప్పిన మాటలు మా అందరకీ కొండంత ధైర్యన్ని ఇచ్చాయని కిర్లంపూడి మండల అధ్యక్షులు అయిరాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం అని సంభోదిస్తూ మన నియోజకవర్గంలో ఇటీవల చెక్కుల పంపిణీ విషయపై ఆయన సందర్శించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ సభ్యత్వాలు బాగా చేయాలని ప్రతీ రాజకీయపార్టీలో కార్యకర్తలే మూల స్థంబాలు లాంటివారని వారిదే పార్టీ విజయంలో ప్రత్యక పాత్రనిచెప్పారు. మార్చి తరువాత భారీ ఎత్తున చేరికలు ఉంటాయని,మన నియోజకవర్గ పలు సమస్యలపై సుదీర్గంగా అడిగి తెలుసుకున్నారు. నిరంతరం పార్టీ అభివృద్ధి మరియు రాష్ట్ర శ్రేయస్సు ఆలోచించే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెనక మనం పనిచేయడం నిజంగా అంత గొప్ప నాయకుడు మనకు దొరకడం మన అదృష్టంగా భావించాలి అంటూ ఎంతో విలువైన సమయాన్ని, సమాచారాన్ని మాకుఇచ్చి ఆయన అనుభవాన్ని సుమారు గంటపాటు మాతో పంచుకుని మాలో ఎంతో ఉత్సాహాన్ని కలిగించారు .జనసేనపార్టీతో మా సుధీర్ఘ ప్రయాణంలో మనోహర్ ఎన్నోసార్లు కలిసినా ఈసారి మాత్రం ప్రత్యేకంగా పిలిపించుకుని మాతో ఆయనతో గడిపిన సమయం, సందర్భం చాలా ప్రత్యేకమైంది అని మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బుదిరెడ్డి శ్రీనివాస్, పాలిశెట్టి సతీష్, గాది రాంబాబు పలవురు పాల్గొన్నారు.