విశ్వంవాయిస్ న్యూస్, జగ్గంపేట:
సరస్వతీ పుత్రుడు జగ్గంపేట వివేకానంద విద్యాసంస్థల అధినేత ఒమ్మి రఘురామ్ తన 23 వ డిగ్రీ యం. ఏ హిస్టరీలో మొదటి సంవత్సరం 69% మార్కులతో పాసైన సందర్భంగా ఆయనను అభిమానులు ఘనంగా సన్మానించారు.ఒమ్మి రఘురామ్ ఇప్పటికి వివిధ విభాగాలలో 22 డిగ్రీలు పూర్తి చేసి నిరంతర విద్యార్థిగా కీర్తి పొంది పలువురికి ఆదర్శంగా నిలిచారని అభిమానులు కొనియాడారు. ఒమ్మి రఘురామ్ అటు విద్యా సంస్థలు నిర్వహిస్తూ, రాజకీయాల్లోనూ, సేవా రంగంలోనూ బిజీ గా ఉన్న చదువు మీద ఆశక్తితో నిరంతరం చదువుతూనే ఉంటారని కొనియాడారు.ఒకటి రెండు డిగ్రీలు చదవడమే కష్ట మనుకుంటున్న నేటి యువతకు రఘురామ్ స్ఫూర్తి అని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకూరి జయరాజ్, ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీను, ఎంపీటీసీ ఆకుల శ్రీధర్,కపవరపు ప్రసాద్, నీలపల్లి అప్పారావు, కిలపర్తి వీరబాబు,,రవి, పల్ల రాజ, పత్తిగిల ప్రసాద్, గొలపలి ప్రసాద్ బిమ్మన స్వామి, మువ్వల ప్రసాద్, వైబోగుల ప్రసాద్, నేదురి వీరబాబు, పల్ల రాజు, కొల్లు యాసు, కొల్లు సతీష్, సానబోయిన సత్తిబాబు , ఇసరాపు లోవరజు,ఇసరాపు రాజు , వైబోగుల వీరబాబు,ఐసారపు సురేష్, మని రామవరం,కేటగిరీ రఘు, సిదిరి మురళి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.