విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
అన్నంపల్లి టోల్గేట్ వద్ద టోల్ ఫీజు వసూళ్ళు చేయడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలి
సిపిఎం పార్టీ డిమాండ్
అమలాపురం మార్చి 04
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం అన్నంపల్లి గ్రామం వద్ద ఏర్పాటుచేసిన టోల్గేట్ వద్ద టోల్ పీజు వసూలు చేయడం తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఎం పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని ఎదుర్లంక నుండి చించినాడ బ్రిడ్జ్ వరకు ప్రధాని రహదారిని కలుపుకుంటూ ప్రత్యామ్నాయం గా బైపాస్ రోడ్డు నిర్మాణం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని అది నేటికీ పూర్తి కాలేదని బట్నవెల్లి నుండి వై జంక్షన్ వరకు వెళ్లే ప్రధానమైన ప్రాంతంలో ఇంకా నిర్మాణ పనులు చేపడుతున్నారని కామనగరువువద్ద బిడ్జినిర్మాణ పనులు పూర్తికాలేదని పాస్టర్లపూడి నుండి చించినాడ వరకు కూడా నిర్మాణ పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఈ నేపథ్యంలో పనులు పూర్తికాకుండా టోల్ ఫీజును ప్రజలపై భారాల మోపుతూ వసూలు చేయడం అన్యాయమని తక్షణం టోల్ పీజును వసూలు చేయడానికి ఆపాలని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది రోజురోజుకు ప్రజల పైన ఏదో రూపంలో భారాలు వేసే ప్రయత్నం తప్ప ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించే ఆలోచన లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు
ఎదురులంక నుండి చించినాడ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో అయిన తర్వాత మాత్రమే నామమాత్రపు టోల్గేట్ ఫీజులు వసూలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అప్పుటి వరకు టోల్గేట్ ఫీజులు వసూలు చేయడాన్ని నిలుపుదల చేయాలని లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు చేశారు
ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి దుర్గాప్రసాద్ పి వసంత్ కుమార్ ముమ్మిడివరం మండల సఖిలేసూర్యనారాయణ పామి బాలయ్య తదితరులు ఉన్నారు