విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణం:
,*నూతన జిల్లాలో చెలరేగుతున్న గంజాయి ముఠాలు*
అమలాపురం విశ్వం వాయిస్ జిల్లా ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం నాడు గంజాయి ముఠాలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి ముమ్మిడివరం నియోజకవర్గం అన్నం పల్లి గ్రామం అక్విడేట్ వద్దపంచుకుని అమ్ముకుందామని ప్రయత్నం చేయగా పోలీసులు కు 23 కేజీల గంజాయి తో పట్టు పడ్డారు వీరు వద్ద నుంచి 23 కిలోల గంజాయి నాలుగు మోటర్ సైకిల్ 4 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు ముద్దాయిలు అంతా కలిసి చెడు వ్యసనాలకు బానిసై గంజాయి తాగుతూ చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతూ కొనుగోలు నిమిత్తం నర్సీపట్నం దగ్గర్లోకి వెళ్లి గంజాయిని కొనుగోలు చేసుకుని అమ్ముకుంటారు పోలీసులకు దొరికిన నిందితులు నక్క మధు, మాకే అబ్బులు, కొండేపూడి సిద్ధార్థ కుమార్, మోకా చంటి మోకా శ్రీనివాసరావు, పెనుమాల విజయ్ కుమార్, నిందితులు రిమాండ్ కొరకు సంబంధిత కోర్టుకు తదుపరి చర్య నిమిత్తం పంపడం అయినది ముమ్మడివరం పోలీసులు తెలియజేశారు
అలాగే అమలాపురం పట్టణంలోని సావరం బైపాస్ దగ్గర మారుమూల ప్రదేశంలో గంజాయిని సమానంగా పంచుకుని అమ్ముకునే నిమిత్తం గుమ్ముకూడి ఉండగా పట్టణ పోలీసు వారికి పట్టుబడిన ఏడుగురు ని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 21 కేజీ గంజాయిని 6 సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్నారు నిందితులు చెడు వ్యసనాలకు బానిసై గంజాయికి అలవాటు పడి తాగుతూ గంజాయి చుట్టుపక్కల అమ్ముతూ కొనుగోలు నిమిత్తం చింతపల్లి ఏజెన్సీలో కొనుగోలు చేసుకుని ఆదివారం నాడు అమలాపురం వచ్చి గంజాయి సమానంగా పంచుకునే క్రమంలో పోలీసులకు పట్టుబడిన నిందితులు1 త్రిపురారి సాయి సూర్య జగదీష్ వయసు 23 సం: 2 దూలం వీరేంద్ర కుమార్ 24 సం:3 గోకర కొండ బాబు 24 సం:4 జుత్తికపవన్ 21 సం:5 వాసంశెట్టి ప్రసాద్ 27 సం;6 బెహర కళ్యాణ్ 20 సం;7 కమిటీ నరసింహ 21 సం వీరందరినీ రిమాండ్ కొరకు సంబంధిత కోర్టుకు తదుపరి చర్య నిమిత్తం పంపడం జరుగుతుంది