విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తాళ్లరేవులో స్వచ్ఛంద రక్తదానం కార్యక్రమం
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆదేశాలతో
తాళ్ళరేవులోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కొరకు ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆదేశాలతో స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆసుపత్రి కమిటీ చైర్మన్ అద్దంకి లక్ష్మీనారాయణ తెలిపారు. రెండో విడతలో భాగంగా తమ రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేయడానికి యువకులు తరలివచ్చారు. సిహెచ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ అద్దంకి లక్ష్మీనారాయణ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాన్ని హాస్పిటల్స్ సూపరిండెంట్ శిరీష, స్థానిక వైసిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.