విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణం:
*ఆర్థిక స్తోమత లేక చదువును నిలిపివేసిన విద్యార్థికి చేయూతనిచ్చిన*
తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు మీరా కుమార్
అమలాపురం. విశ్వం వాయిస్ న్యూస్
చదువుదామనే ఆసక్తి ఉన్న ఆర్థిక స్తోమత అడ్డు రావడంతో చాలామంది కలలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. కొంతమంది మనసున్న మహానుభావులు వారిని గుర్తించి ఆర్థికంగా చేయూతనందించి ఉన్నత చదువులు చదివిస్తుంటారు. అలాంటి వారిలో తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు మీరా కుమార్ ఒకరు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆర్థికంగా నిలదొక్కుకున్న కుమార్ తన సామాజిక వర్గంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని అనేక రకాలుగా ఆదుకుంటుంటారు. అదేవిధంగా ఇటీవల ఆర్థిక స్తోమత లేక ఫీజు కట్టలేని ఓ విద్యార్థినికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వివరాల్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన కట్టా శ్రీనివాసరావు, భార్య సునీత, పిల్లలు హైదరాబాద్ లోని జగద్గిరి గుట్ట లో నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలో శ్రీనివాసరావు మరణించగా వారి అమ్మాయి భార్గవి కూకట్ పల్లి ప్రగతి కాలేజీ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమార్తె కు ఫీజు కట్టలేక తల్లి నిస్తేజంగా ఉండిపోయింది. భార్గవి కాలేజీకి వెళ్లలేక ఇబ్బంది పడుతుంది.
విషయం తెలుసుకున్న గుత్తుల మీరాకుమార్ వెంటనే ఫీజు చెల్లించడానికి వారికి 10,000 పది వేల రూపాయలు అందించి తమ దాత్రుత్వాన్ని చాటుకున్నారు. మీరా కుమార్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.