విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కైట్ కాలేజీలో ఘనంగా టెక్నికల్ శాస్త్ర ఈవెంట్ ముగింపు వేడుకలు
తాళ్లరేవు మండల పరిధి కోరంగి లో ఉన్న కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో వారం రోజులు పాటుగా నిర్వహిస్తున్న టెక్నికల్ ఈవెంట్ ముగింపు వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఏడిద రామకృష్ణ ఆధ్వర్యంలో సైంటిఫిక్ అప్రోచ్ ఫర్ సోషల్ అండ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు కార్యక్రమానికి ఐఐటి ప్రొఫెసర్లు డాక్టర్ అనిల్ కుమార్, శత్రుం జై రావత్, చిరంజీవి ఎర్ర, సచిన్ చౌదరిలు హాజరయ్యారు. విద్యార్థులు 17 ప్రదర్శనలు ప్రాజెక్టులుగా ప్రదర్శించారు. 17 ప్రాజెక్టులను తిలకించి కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వివిధ కళాశాలల నుంచి వచ్చిన అధ్యాపకులు స్టూడెంట్స్ పాల్గొన్నారు.