విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణ:
ఉపాధ్యాయులపై అధికారుల వేధింపులు
జిల్లా అధ్యక్షులు ఖండిస్తూ యూటిఎఫ్ అద్వర్యంలో నిరసన ప్రదర్శన –
విద్యార్థులు, స్కూలుకు , రాకపోయినా హోంవర్క్, చేయకపోయినా షోకాజ్ నోటీసులు
డా॥ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో గడియార స్తంభం సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు యూటీఎఫ్ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం సిపిఐ పార్టీలు మద్దతు తెలియజేసి ర్యాలీలో పాల్గొన్నాయి
ఈ సందర్భంగా
యుటిఎఫ్ జిల్లాఅద్యక్షలు పెంకే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉపాధ్యాయులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని, ఉపాధ్యాయులను మానసికంగా కృంగదీసే దానికి కంకణం కట్టుకొని మరణించే వరకు వేధింపులు చేస్తున్నారు. ఇటీవలకాలంలో ఉపాధ్యాయుల మరణాలే ఋజువులుగా ఉన్నాయి.
ప్రభుత్వం ఇవ్వవలసిన పాఠ్యపుస్తకాలు సకాలంలో ఇవ్వలేదు. దానికి ఉపాధ్యాయులనే బాధ్యుల్ని చేస్తున్నారు. పిల్లవాడు బడికి రాకపోయిన, హోమ్‌వర్క్ చేయకపోయిన ఉపాధ్యాయుడుకే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. అనారోగ్య కారణంచే అత్యవసర సెలవులు కూడా ఇవ్వకుండా అధికారుల వేధింపులను తట్టుకోలేక ఉపాధ్యాయులు ప్రాణాలను కోల్పోతున్నారు.
ఇలా వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై హత్యానేరం క్రింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు . నిరసన ప్రదర్శనలో వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు
నాయకులు కట్టాసురేష్ కుమార్ కెసురేష్ పి సురేంద్ర పెన్నాడ శ్రీనివాసరావుపి మురుగేశ్వరరావు టి దుర్గాప్రసాద్ జివి రమణ ఏ కాశీవిశ్వేశ్వరరావు చంద్రకళా పిఎస్ సిరోమని సిహెచ్ రూత్ మేరీ
సిపిఎం సిపిఐ నాయకులు జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు కె సత్తిబాబూ వసంత్ కుమార్ పి రామచంద్రరావు జి దుర్గాప్రసాద్ ఎస్ సూర్యనారాయణ కే మోహన్ రావు పాము బాలయ్య నిమ్మకాయల శ్రీనివాసరావు తాడి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు