విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
ఆక్వా చెరువుల తవ్వకాలకు నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చిన అధికారులు
అధికారులపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
తాళ్ళరేవు మండల పరిధిలోని వరి పండించే భూములను ఆక్వా చెరువులుగా మార్చడానికి జోరుగా అనుమతులు ఇస్తున్నారని తాళ్లరేవు మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు టి ఈశ్వరరావు విమర్శించారు. పత్తి గొంది గ్రామంలో రెండు ఎకరాల చెరువులు తవ్వే నిమిత్తం మండల అధికారులు అనుమతులు ఇచ్చారని, ఈ రెండు ఎకరాలు తవ్వి తరుణంలో ఈ ఆయకట్టుపై ఉన్న వరి పండించే రైతులు నష్టపోతారని, ఇప్పటికీ నీటి ఎద్దడిని రైతులు చూస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు స్థానిక రైతులు పాల్గొన్నారు. రైతు డి వి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఆయకట్టుపై వరి పండించే రైతుకు ఎటువంటి నష్టం జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. వల్లు రాజబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఎప్పటినుంచో ఉన్న సమస్యని దాన్ని పరిష్కరించకుండా ఆక్వా చెరువులు తవ్వడానికి అనుమతి ఇవ్వడం ఆలోచించాల్సిన విషయమేనని, ఈ అనుమతులు ఇచ్చిన అధికారులపై బహిరంగ విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని విశ్రాంత ప్రభుత్వ వైద్యులు, స్థానిక రైతు అయిన డి వి సత్యనారాయణ డిమాండ్ చేశారు.