కాకినాడను తుఫానుల నుండి రక్షిస్తున్న ఐలాండ్ ఈ ద్వీపం
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ హోప్ ఐలాండ్ ద్వీపంలో 105 మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి
కాకినాడను తుఫానుల నుండి రక్షిస్తున్న ఐలాండ్ ఈ ద్వీపం
తాళ్ళరేవు మండలానికి సంబంధించిన కోరంగి గ్రామపంచాయతీ పరిధికి ఉన్న కాకినాడ సముద్ర తీరంలో మధ్య భాగంలో ఉన్న ఒక ద్వీపం ఈ హోప్ ఐలాండ్. ఈ ఐలాండ్ కు మరో పేరు ఆశాద్వీపం. ఈ ఐలాండ్ కాకినాడను భారీ తుఫానుల నుండి రక్షించే రక్షణ కవచంగా ఉంది. ఈ ద్వీపంలో సుమారుగా 105 మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ ద్వీపంలో ఉన్న ప్రజలకు అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ, విద్యుత్ విషయంలో ఆలోచిస్తే అక్కడ ఉన్న పాఠశాలలను సోలార్ విధానం ద్వారా విద్యుత్ ఎలా ఉత్పత్తి చేసుకుంటున్నారు ఆ విధానాన్ని కాకినాడ జర్నలిస్టులు పర్యటనలో పరిశీలించారు. సుమారు ఈ ద్వీపంలో 300 జనాభా కలిగిన ఈ ప్రాంతం ప్రజలను కాకినాడ జర్నలిస్టులు వారి జీవన విధానాన్ని మత్స్యకారుల స్థితిగతులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ద్వీపంలో నివసిస్తున్న ఈ ప్రజలు మరి మనోభావాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో స్కూల్ రోడ్లు అన్ని సదుపాయాలు ఉన్నాయని, కానీ మేం సిటీకి రావాలంటే కొంత ప్రయాసతో కూడుకున్న పని అని వారు మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి ఒక ద్వీపం సముద్రం మధ్యలో ఉండి ఆ ద్వీపం వలన ఒక పట్టణం రక్షించబడడం ఒక గొప్ప విషయంగా భావించవచ్చు. ఈ ద్వీప పర్యటన నిమిత్తం కాకినాడ జర్నలిస్టులు వెళ్లి ద్వీప సందర్శన చేసి అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ద్వీప ప్రత్యేకతను జిల్లా ప్రజానీకం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని వారు సూచించారు.