విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రాపురం:
*రామచంద్రాపురం మండలం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం*
నోడల్ ఆఫీసర్ డాక్టర్ టి. సందీప్ నాయుడు పాల్గొన్నారు
రామచంద్రాపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం గురించి రామచంద్రపురం మండల కన్వర్జెన్సీ కోఆర్డినేషన్ సమావేశము ద్రాక్షారామ పంచాయితీ నందు జరిగినది. రామచంద్రపురం మండల జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ నోడల్ ఆఫీసర్ డాక్టర్ టి సందీప్ నాయుడు మాట్లాడుతూ 14-3-23 తేదీన 1 నుండి 19 సంవత్సరములు మధ్య గల పిల్లలకు అంగన్వాడి స్కూల్స్ లోను గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్లలోనూ కళాశాలలోనూ నులిపురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ మాత్రలను మ్రింగించాలని తెలిపారు. ఎంపీడీవో మున్సిపల్ కమిషనర్ , మెడికల్ ఆఫీసర్లు సూచనలతో పిల్లలందరూ మాత్రలు మ్రింగేటట్లు ఉపాధ్యాయులు ,అంగన్వాడీ టీచర్లు ,ఏఎన్ఎంలు సహకరించాలని తెలిపారు. రామచంద్రపురం అర్బన్ పి హెచ్ సి లలో12,240 పిల్లలకు ,ద్రాక్షారామ పిహెచ్ సి పరిధిలో8139 పిల్లలకు ,వెల్ల పిహెచ్సి పరిధిలో2944 పిల్లలకు మాత్రం మింగించాలని తెలిపారు డాక్టర్ పి మమత మాట్లాడుతూ పిల్లలు ఈ మందులు తీసుకొనటం వలన రక్తహీనత రాదు.పిల్లల యొక్క విద్య ఆరోగ్య నాణ్యత పెరుగుతుందని అలాగే పిల్లలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా నులిపురుగులు శరీరంలోనికి ప్రవేశించవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్వీ ఆదినారాయణ సిహెచ్ఓ యు వీర వేణి ,డివిజన్ సూపర్వైజర్ కె.గోవింద్ బాబు, సూపర్వైజర్లు కె.శ్రీనివాస్, వి ఈశ్వరమ్మ , ,జి కమల్ శేషు, డి.రాజేశ్వరి, వీరలక్ష్మి ఉపాధ్యాయులు , ఐసిడిఎస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, మరియు పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.