WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

అస్వస్థకు గురైన విద్యార్థుల వద్దకు హుటాహుటిన చేరుకున్న కలెక్టర్ హిమాన్సు శుక్లా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

*అస్వస్థకు గురైన విద్యార్థుల వద్దకు హుటాహుటిని చేరుకున్న కలెక్టర్ హిమాన్సు శుక్లా*

 

ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మరియు తల్లిదండ్రులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్

 

ఘటనకు కారకులైన వారిపై కేసు నమోదు చేసినట్లు అరెస్టు చేసిన వెంటనే విచారణ చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు

అమలాపురం విశ్వం వాయిస్ జిల్లా ప్రతినిధి

 

అమలాపురం మార్చి 13: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక మండల పరిధిలోని బండారులంక గ్రామంలో విజిడమ్ ప్రైవేట్ పాఠశాల ప్రహరీ గోడ వెలుపల సోమవారం ఉదయం 10 గంటలకు కొంతమంది వ్యక్తులు చెత్తాచెదారం, పాత వాహనాలను తగులబెట్టడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించి పాఠశాల పై అంతస్తులో ఉన్న 40 మంది విద్యార్థినీ విద్యార్థులు పొగ మరియు కాలుష్యం వ్యాపించడం మూలంగా అస్వస్థకు గురయ్యారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంఘటన చోటు చేసుకున్న వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక బండారు లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ఫస్ట్ ఎయిడ్ చికిత్సను అందించారని ఆయన తెలిపారు. వీరిలో 29 మంది ఫస్ట్ ఎయిడ్ చికిత్స అనంతరం సాధారణ స్థితికి చేరుకున్నారని ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించినప్పటికీ 11 మంది విద్యార్థిని విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నందున స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సను అందించడం జరుగుతో oదన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ స్థానిక ఏరియా ఆసుపత్రి సందర్శిం చి 11 మంది విద్యార్థులతో మరియు వారి తల్లిదండ్రులతో సంప్రదించి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించడం జరిగిందన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య సేవలకు సమన్వయ అధికారిని పద్మశ్రీ రాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం దుర్గారా వు దొర ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్రావు లు ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షించడం జరుగు తోoదన్నారు. 11 మంది విద్యా ర్థులకు ఆక్సిజన్ సరఫరా మరియు బెడ్లు కేటాయించడం జరిగిందని రెండు మూడు గంటల్లో మీరు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వైద్యు లు ధ్రువీకరించా రన్నారు. మరోవైపు ఈ సంఘటన కు కారకులైన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని సాయంత్రం లోపు వీరిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్ర మంలో ఆర్డీవో వసంతరాయుడు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారిని పద్మశ్రీ రాణి, ఆసుపత్రి వైద్యులు, స్థానిక నాయకులు చెల్లిపోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement