*ప్రశ్నించిన వారి ఇళ్లపై దాడులు*
విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:
అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయని ఇళ్లపై దాడులకు దిగుతున్నారని కొత్తపేట నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు.
అధికారం అడ్డుపెట్టుకుని మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ధన దాహంతో కొట్టుమిట్టాలాడుతున్నారు.
వారిని ప్రశ్నించినా, లేదా అడ్డు తగిలినా ఇంటి మీదకు వచ్చి దాడులకు దిగుతున్నారని
దళిత సోదరులను పావులుగా చేసి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గ్రామాలలో ప్రశాంతతను భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న రాత్రి మాజీ సర్పంచ్ గుర్రాల నాగభూషణం ఇంటిపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
వాస్తవ విషయాన్ని పరిగణలోకి తీసుకుని చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అమలాపురం జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టవలసిందిగా జిల్లా ఎస్పీని అభ్యర్థించారు.
అసలు విషయానికొస్తే గ్రామాలలో ఉన్న పట్టా భూముల్లో మట్టిని అక్రమంగా తరలిస్తుంటే కొమరాజులంక మాజీ సర్పంచ్ గ్రామస్తులు కలిసి న్యాయస్థానన్ని ఆశ్రయించారు.
న్యాయస్థానం ద్వారా మట్టి మాఫియా కు అడ్డు తగులుకోవడంతో ఇళ్లపై దాడులకు దిగారు భయభ్రాంతులకు గురిచేసి వారు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.
జరిగిన సంఘటనను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు బాధితులకు అండగా నిలిచారు.
ఇటువంటి అనాగరిక చర్యలు మానుకోవాలని హితువు పలికారు • •
లేదంటే ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని. తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు,కంఠంశెట్టి శ్రీను,ధర్నాల రామకృష్ణ, బండారు సత్తిబాబు , ముత్యాల బాబ్జి సయ్యపరాజు రామకృష్ణంరాజు, చిలువూరి సతీష్ రాజు, త్శామా బాబు,కాసా సాగర్, మాసాబత్తుల ఆనందరావు, గుబ్బల మూర్తి ,పల్లి ఏసు, కాసు రెడ్డీ, యర్రంశెట్టి బుజ్జి, మిరపయల రాము ,సిద్దిరెడ్డి శ్రీను, పెచ్చట్టి చిన్నారావు, దొమ్మేటి శ్రీను, సింహ,బద్ద ఏసు, తదితరులు పాల్గొన్నారు.