విశ్వంవాయిస్ న్యూస్, ముమ్మిడివరం:
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ
ముమ్మిడివరం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్న
ముమ్మిడివరం తెదేపా పార్టీ ఇంచార్జ్ బుచ్చిబాబు, పార్లమెంట్ ఇంచార్జ్ హరీష్ మాధురీ
నాయకులు ,కార్యకర్తలు, సంబరాలు ,జరుపుకున్నారు
ముమ్మిడివరం విశ్వం వాయిస్ న్యూస్ రిపోర్టర్
ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ , తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో ఘన విజయం సాధించటం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ్ దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గంటి హరీష్ మాధుర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు, ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల పట్టబద్రుల ఎన్నికలలో ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు, ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి కి చెంపపెట్టు అని, విశాఖ వాసులు జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అని ఎన్నికల ఫలితాలు ఇచ్చారని అమరావతి రాజధాని అని మూడు రాజధానులు వద్దని ఈ సందర్భంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తూర్పు రాయలసీమ కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి , పశ్చిమ రాయలసీమ కూడా విజయం సాధించే దిశగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రాబోయే రోజుల్లో వైసిపి పాలనకు అంతం పలికే రోజు దగ్గర పడిందని వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఈ సందర్భంగా అన్నారు, మరో ముఖ్య అతిథి హరీష్ మాధుర్ మాట్లాడుతూ తూర్పు రాయలసీమ ఎన్నికల అబ్జర్వర్గా వెళ్లిన నాకు అక్కడ ప్రజలందరూ కూడా ఈ రాక్షస పాలన అంతం అవ్వాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని రాయలసీమ వాసులు అందరూ కోరుకుంటున్నారని, నిన్న రాష్ట్ర బడ్జెట్లో కోనసీమ రైల్వే లైన్ కి ప్రభుత్వ వాటా ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా దారుణమని ఎక్కడ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రజల గుణపాఠం చెప్పడం తద్యమని ఆయన అన్నారు,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి మాట్లాడుతూ నేను ఎన్నికల పరిశీలకులుగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా పర్యటించినప్పుడు అక్కడ ప్రజలందరూ వైఎస్ఆర్సిపి పాలన అంతం అవ్వాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పాత్ర వహించినటువంటి దాట్ల బుచ్చిబాబుని, గంటి హరీష్ మాధురిని గుత్తుల సాయిని భారీ గజమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నాగిడి నాగేశ్వరరావు, గొల్ల కోటి దొరబాబు, మందాల గంగ సూర్యనారాయణ, చెల్లి అశోక్, టేకుమూడి లక్ష్మణరావు, తాడి నరసింహారావు, పొద్దోకు నారాయణరావు, అర్ధాన్ని శ్రీనివాసరావు, విత్తనాల వెంకటరమణ, వెంట్రు సుధీర్, చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి, యాళ్ల ఉదయ్ ,కోరసిక రాము, పొత్తూరి విజయభాస్కర వర్మ, కట్ట త్రిమూర్తులు, కంచర్ల లక్ష్మణరావు, వాండ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, మోపురి వెంకటేశ్వరరావు, పిల్లి నాగరాజు, రెడ్డి సుధీర్, మెండీ కమల, వాసంశెట్టి అమ్మాజీ, బొక్క రుక్మిణి, కొండేటి వెంకటలక్ష్మి, కుడుపూడి మల్లేశ్వరి, గుర్రాల పుష్ప, బొంతు నాగరాజు, విల్ల వీరస్వామి నాయుడు,సత్తి నూకరాజు, గుబ్బల దాసు, మిమ్మితి చిరంజీవి,కురసాల శివ,, కాశి లాజర్, అడబాల సతీష్, లోకనీడు వెంకటేశ్వరరావు, గోదాసి గణేష్, రెడ్డి శ్రీను, కాశి కాశీపతి, బూరుగు కళ్యాణ్, చెల్లూరి సుభాష్, కుంచనపల్లి సురేష్, గోరంట్ల శ్రీనివాస్ రాజు, అయ్యల శ్రీను, గేసాల చంద్రరావు, రాంకీ రెడ్డి రాంబాబు, పల్ల రాజబాబు, చింతలపూడి కొండబాబు, మొదలగు వారు పాల్గొన్నారు.