విశ్వంవాయిస్ న్యూస్, ఆత్రేయపురం:
ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామికి బుల్లితెర నటులు 25 వేలు విరాళం
ఆత్రేయపురం, విశ్వం వాయిస్: ర్యాలీ ఆలయం కేశవ స్వామిని సినీ నటులు తోట జానకిరామ్ (జాకీ), హరిత దంపతులు శనివారం దర్శించుకున్నారు. దేశంలోనే ఎక్కడా లేనట్టి ప్రముఖ పుణ్యక్షేత్రం ఐదు బుధవారాలు చేస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే నిత్యం గంగ పాదాల మధ్య ప్రవహిస్తూ ముందు పురుషరూపం వెనకాల స్త్రీ రూపం కలిగిన స్వయంభు శ్రీ జగనమోహిని కేశవ స్వామి ఆలయాన్ని సినీ నటులు జానకిరామ్ హరిత దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందారు. అనంతరం స్వామివారి శ్రవణ నక్షత్ర మాస కల్యాణం నందు పాల్గొని ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం 25 వేల రూపాయలను విరాళంగా అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేవస్థానానికి ఎప్పటినుంచో రావాలని కోరిక ఉండేదని ఈ స్వామి వారిని మనసులో కోరుకున్నప్పుడు నుంచి అనుకున్న పనులు జరుగుతున్నాయని ఇప్పుడు ఈ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషాన్ని పొందానని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. స్వామి వారి ఆశీస్సులతో తప్పకుండా మళ్లీ దర్శించుకోవడానికి ర్యాలీ గ్రామం వస్తామని ఆ దంపతులు జాకీ హారిత అన్నారు. ఈ దంపతులకి ఆలయ ఈవో కృష్ణ చైతన్య, అర్చక స్వాములు, శ్రీను, స్వామివారి చిత్రపటం ఇచ్చి సత్కరించారు.