విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఆసుపత్రి కమిటీ సభ్యులు
తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ప్రజా వైద్యశాల విభాగంలో రాష్ట్రస్థాయిలో ఆరవ ర్యాంక్ మరియు జిల్లా స్థాయిలో ఒకటవ ర్యాంక్ సాధించిందని డిప్యూటీ సివిల్ సర్జన్ శిరీష తెలిపారు. సివిల్ సర్జన్ మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి సహకరించిన నాయకులకు అధికారులకు స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఈ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్య సేవలు రోగులకు ప్రజలకు అందించాలని, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని వారు వెల్లడించారు.