*అంగన్వాడీ మహిళలను నిర్బంధించడం అప్రజా స్వామికం*
*నిరసన తెలియజేసిన తెలుగుదేశం పార్టీ*
విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:
- తమ న్యాయమైన డిమాండ్లు సాధనకై ఛలో విజయవాడ పేరుతో తరలి వెళ్తున్న అంగన్వాడి మహిళలను రావులపాలెంలో పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించడం అప్రజాస్వామిక చర్య అనీ తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు.. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న టిడిపి నాయకులు అంగన్వాడీ మహిళల నిర్బంధాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడి మహిళలని వెంటనే విడుదల చేయాలని వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభి రామారావు, అమలాపురం పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షులు చిలుకూరి సతీష్ రాజు, సయ్యపరాజు రామకృష్ణంరాజు, కేతా శ్రీనివాసు, సిద్దిరెడ్డి శ్రీనివాసు, పెచ్చెట్టి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.