విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
*నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు, 2/- రూపాయలు అందించిన నల్లా చారిటబుల్ ట్రస్ట్*
మామిడికుదురు , విశ్వం వాయిస్:
అప్పనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి నల్లా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా శనివారం
సహాయం అందించారు. బుంగ నాగమ్మ కుటుంబానికి రూ.2 వేలు ఆర్థిక సహాయంతో పాటు
బియ్యం, నిత్యావసరాలు. దుస్తులు ట్రస్టు చైర్మన్ నల్లా పవన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ
సందర్భంగా పవన్ మాట్లాడుతూ నల్లా పవన్ ట్రస్టు ద్వారా పేదలకు సేవలందిస్తున్నామన్నారు.
ఈ ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఉప
సర్పంచ్ మేడేపల్లి చిన్న, స్థానికులు కంకిపాటి వెంకటేశ్వరరావు, తులా గోపాలకృష్ణ, గెడ్డం
వెంకటేశ్వరరావు. తులా బ్రహ్మాజీ, బొలిశెట్టి శివ కామిశెట్టి సూరిబాబు, వేళంగి రాజు
పాల్గొన్నారు.