విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం
తాళ్ళరేవులోని స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బిజెపి పేద ప్రజలకు బడ్జెట్లో కోతలు విధించిన కారణంగా వ్యవసాయ చట్టాల దీక్ష విరమణ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఏప్రిల్ 5వ తేదీన జరగబోవు చలో ఢిల్లీ కార్యక్రమానికి రైతులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతు నాయకులు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.