తాళ్ళరేవు మండలం పిల్లంకలో వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్ళరేవు మండల పరిధిలోని పిల్లంక గ్రామంలో నూతనంగా నిర్మించిన సుమారు 41 లక్షల రూపాయలతో ఓఎన్జిసి సి ఎస్ ఆర్ నిధులతో నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంక్ ను స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. మంచినీటి ట్యాంకును ప్రారంభించి ప్రజలందరికీ అందుబాటులో అన్ని సదుపాయాలను జగన్ ప్రభుత్వం ఇస్తుందని ప్రతి ఒక్కరూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జడ్పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్, తాళ్ళరేవు ఎంపీపీ రాయుడు సునీత, ఐ పోలవరం జడ్పిటిసి ముదునూరి సతీష్ రాజు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.