విద్యుత్ కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్న అధికారులు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్ళరేవు మండల పరిధిలోని కోరంగి గ్రామపంచాయతీ సీతారాంపురం పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వివరాల ప్రకారం యానం వైపు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగిపడింది. ఈ ప్రమాదంలో విరిగిన విద్యుత్ స్తంభాన్ని విద్యుత్ శాఖ అధికారులు ఏఈ లైన్మెన్ సిబ్బంది శ్రమించి విద్యుత్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. లారీ డ్రైవర్లు కొందరు మద్యం సేవించి, కొందరు పని ఒత్తిడి వల్ల ఎక్కువ డ్యూటీ టైం ఉండడం వల్ల పని ఒత్తిడికి గురై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేలా పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి తనిఖీలు ముమ్మరం చేసి మద్యం సేవించిన వారిని మద్యం సేవించడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు గురించి వారికి వివరించి ప్రమాదాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రమాదంలోనే ఉదాహరణగా తీసుకుంటే ఎటువంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ అదే ఉదయం సమయంలో అయితే ఎన్నో వాహనాలు ప్రజలు రద్దీ ఉండేదని ఎంతో ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.