– గుండాల ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి
– పురుషోత్తపట్నం సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ
విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక:
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగిందని గుండాల ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి పేర్కోన్నారు. మండల పరిధిలోని పురుషోత్తపట్నం గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు ముఖ్య అతిథిగా గుండాల ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి హాజరై మాట్లాడుతూ అయా గ్రామాల్లో వున్నటువంటి ప్రధాన సమస్యలను ప్రజలందరూ ఐక్యతతో పరిష్కారం అయ్యేలా చూడాలని తెలిపారు. ఈ గ్రామసభలో లేవనెత్తిన రెండు ప్రధాన సమస్యలను ప్రజలందరి ఆమోదంతో సంతకాల సేకరణతో ఏకగ్రీవంగా సభలో ఆమోదించినట్టు గుండాల ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ , విద్యుత్ శాఖ , ఐసిడిఎస్ , సచివాలయం సిబ్బంది , అగ్రికల్చర్ అసిస్టెంట్ లక్ష్మణ్ , స్ధానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు , గ్రామస్థులు పాల్గొన్నారు.