WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ముద్దాయిలను అరెస్టు చేయాలి రాయవరం ఎస్సైను సస్పెండ్ చేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న రాయవరం ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు

 

ఎస్సై సురేష్ అండదండలతో హరిజన పేట గ్రామ పెద్దలు, వైకాపా నాయకులు రౌడీయిజం

 

అమాయకులైన గ్రామ ప్రజలపై వీరంగం సృష్టిస్తూ దాడులు చేస్తున్నారంటూ బాధితులు

 

అడిషనల్ ఎస్పీ లతా మాధురీ

వద్ద మొర పెట్టుకున్నా వైనం

 

అమలాపురం విశ్వం వాయిస్ ఎస్పీ కార్యాలయంన్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట

నియోజకవర్గం రాయవరం మండలం ,పసలపూడి గ్రామానికి చెందిన మహిళలు రాయవరం ఎస్సై సురేష్ తమపై అక్రమం గా కేసులు బనాయించి వేధిస్తున్నారని గురువారం నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి కార్యాలయం బయట అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఎస్ఐ ని సస్పెండ్ చేయాలి ముద్దాయిలను వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసి నిరసన తెలియజేశారు అనంతరం ఎస్పీ శ్రీధర్ కి ఫిర్యాదు చేశారు పసలపూడి గ్రామానికి చెందిన కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ మాపై వేధింపులు చేస్తున్నాడని మైనర్ బాలికని చూడకుండా కేసు బనాయించి పేరు తొలగించడానికి 15000 వేల రూపాయలు లంచం తీసుకున్నారని బాధితులు అడిషనల్ ఎస్పీ లతా మాధురీ వద్ద మొర పెట్టుకున్నారు

 

వివరాల్లోకి వెళితే…

 

మండపేట నియోజకవర్గం రాయవరం మండలం, పసలపూడి గ్రామం హరిజన పేటకు చెందిన బుంగ పెద్ద

ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకుని ఆ సీసీ కెమెరాలు ఇంటి ప్రక్కనే ఉన్న ఇంటి

లో నివాసం ఉంటున్న మహిళ, మైనర్ బాలిక, (వృద్ధురాలు(80) స్నానాలకు గాను తడకలతో కట్టుకున్న స్నానాల గది వైపు సీసీ కెమెరా ఉండటాన్ని గమనించి పెద్దను, నిలదీయడంతో ఆవేశంతో వృద్ధురాలైన,దండంగి సివాలక్ష్మి, మనవరాలు పై దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టారని వీళ్ళిద్దరూ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని రాయవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై సురేష్ పసలపూడి గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులకు కొమ్ము కాస్తూ మా యొక్క ఆధార్ కార్డులు తీసుకురమ్మని తిరిగి మాపై కేసు పెట్టారని పదవ తరగతి చదువుతున్న (మైనర్ బాలిక) పై కేసు లో పేరు తొలగించమని ప్రాధేయపడగా పేరు తొలగించడానికి ఎస్సై సురేష్ 15 వేల రూపాయల లంచం తీసుకున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు జరిగినటువంటి గొడవలు చూసిన మహిళ కొల్లపు మేరి (వితంతువు) సాక్ష్యం చెబుతాను అనే నెపంతో తనపై కక్ష పెంచుకుని హరిజన పేట పెద్దలు, మారెళ్ళ అబ్బులు, దండంగి నాగేశ్వరరావు, బుంగ పెద్ద , గంటి గంగరాజు, దాకి వీర్రాజు, రాంబాబు వీరందరూ కలిసి మా కుటుంబాన్ని కులము నుండి వెలివేషమంటూ బెదిరించడమే కాకుండా మీరు ఇక్కడ ఉంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు మేము స్నానాలు చేసేటప్పుడు పెద్ద, సీసీ కెమెరాలు రికార్డు అయింది అంటూ మీ దిక్కున చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారు మీయొక్క వీడియోలు యూట్యూబ్ లో పెడతానని బెదిరిస్తున్నాడని పెద్ద ,తనని ఏం చేస్తాడో అని ప్రాణభయంతో భయం భయంగా బ్రతుకుతున్నానని నా కుమారుడు రాజు కి కూడా ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని తన తండ్రికి ) అనారోగ్య వంతుడని నాకు నా తండ్రికి నా కొడుకే ఆధారం అని కన్నీటి పర్యంతం అయింది అదే గ్రామానికి చెందిన మరొక మహిళ కుంచె కృష్ణమ్మ తన భర్త చనిపోయాడని తనకు అత్తమామలు లేరని అందువలన పుట్టిల్లు అయిన పసలపూడిలో తన తండ్రి వద్ద కూలి పని చేసుకుని ఒంటరిగా జీవిస్తున్నా తనని శారీరక కోరిక తీర్చమని పదేపదే వేధిస్తున్నారని గతంలో నాపై అత్యాచారం చేయడానికి రమణ, పెద్ద, రాంబాబు .

,,ప్రయత్నించగా కేకలు వేయడంతో పారిపోయారని అదే విషయాన్ని కుల పెద్దలుకు చెప్పగా ఎటువంటి న్యాయం చేయలేదని వీరంతా ఒకే కుటుంబానికి,ఇంటి పేరుకి చెందిన వారిని అందువలన పేటలో వీరు ఆడింది ఆట పాడింది పాటగా ఉందని కుల పెద్దలు వల్ల నాకు ఎటువంటి న్యాయం జరగదని పోలీస్ వారే నాకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతుంది

 

హైదరాబాదులో నివాసం ఉంటూ వృద్ధుడైన తన తండ్రిని చూడటానికి తన భర్తతో పసలపూడి గ్రామం హరిజన పేటకు చెందిన సన ఫాతిమా పై గతంలో ఉన్నటువంటి గొడవలు కారణంగా కక్ష పెంచుకొని తన భర్తతో తండ్రిని చూసేందుకు ఇంటికి వచ్చిన తనపై యాసిడ్ తో దాడి చేశారని ఆడుకుంటున్న తన పిల్లలకు చాకు

చూపించి బెదిరించారని గ్రామంలో పెద్దలుగా నాయకులు గా చలామని అవుతున్న స్థానిక లు పై

కఠిన చర్యలు తీసుకోవాలని వారి నుంచి రక్షణ కల్పించాలని ముద్దాయిలను వెంటనే అరెస్టు చేసి మాకు న్యాయం చేయాలని ముద్దాయిలకు సహకరిస్తున్న ఎస్సై సురేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆక్రందన తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement