విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:
రావులపాలెం సెంటర్ నందు మే 7వ తేదీ ఆదివారం న దళితనాయకులు, యువకుల ఆధ్వర్యంలో జరుపబడే బ్లూ మార్చ్ కు పోలీసు వారి తరుపున ఎటువంటి అనుమతులు లేవు, బ్లూ మార్చ్ వలన పోలిటికల్ గ్రూప్స్ గా ఏర్పడి ప్రజా శాంతికి భంగం కలిగే విదముగా ఉన్నందున మరియు నేషనల్ హై వే కు అంతరాయము కలిగి
వాహనముల రాక పోకలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున ఈ బ్లూమార్చ్ ర్యాలీ కి అనుమతులు ఇవ్వలేక పోతున్నాము అని
అందువలన ఈ బ్లూ మార్చ్ ర్యాలీ కి అనుమతులు లేవు గనుక యువకులు, దళిత నాయకులు ఈ విషయాన్ని గమనించి పోలీస్ వారికి సహకరించగలవలసినదిగా కోరుచున్నాము అని రావులపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ కోరారు…