విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:
వ్యాయామ కళాశాల ఆయుర్వేదం ఫిజియోథెరపీ హాస్పిటల్ మెంబర్స్ మానవత్వాన్ని చాటారు. మండపేట కు చెందిన నడింపల్లి అనంతలక్ష్మి కడుపులో కంతులు పెరగడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న ఆమె సర్జరీ నిమిత్తం బ్లడ్ కావాలని వైద్యులు సూచించారు. దీంతో అనంతలక్ష్మి బంధువులు కొత్తపేటకు చెందిన స్వామి వివేకానంద యోగా ఆశ్రమం వారిని సహాయం కోరారు. దీంతో ఐదుగురు యువకులు బండారు తేజ, సుంకర అనిల్ ఎలమంచిలి ప్రదీప్, దాసింశెట్టి ప్రవీణ్, సుధాకర్ లు రక్త దానం చేశారు. రక్తదానం చేసి ప్రాణాల్ని కాపాడడం అభినందనీయమని ఆయుర్వేద ఫిజియోథెరపీ వైద్యుడు యోగ శ్రీనివాస్ అన్నారు.