తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో నిర్వహించిన ఎమ్మెల్యే
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్లరేవు మండల పరిధి పిల్లంక గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. పథకాలు అందని వారికి అర్హులైతే తక్షణమే ఏర్పాటుకు మంజూరు చేసేందుకు అక్కడ ఉన్న సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేస్తున్న పనులను గురించి ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వం ప్రజలకు తోడుగా ఉంటుందని ఆదరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.