విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తాళ్లరేవు మండల పరిధిలోని చొల్లంగి గ్రామానికి చెందిన బొడ్డు గంగాధర్ రావు పురుగులు మందు తాగి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కోరంగి ఎస్ఐ పి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. వివరాలు ప్రకారం బొడ్డు గంగాధర్ రావు చొల్లంగి వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూమిని కౌలుకు సాగు చేస్తున్నాడు. ఇతరుణంలో పంట నష్టం రావడంతో అప్పుల పాలై తాగుడికి బానిసై పొలానికి ఉపయోగించే పురుగుల మందులు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 కి ఫోన్ చేసి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.