విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
ఆర్టీసీ బస్సు ఆటో డీ
తాళ్ళరేవు మండలం సంకటరేవు సమీపంలోని జాతీయ రహదారి 216 పై కాకినాడ నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. వర్షం కారణంగా ప్రమాదం సంభవించినట్లు స్థానికులు అలాగే బస్ డ్రైవర్ చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి రహదారుల వర్ష గాలి బీభత్సంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని సమాచారం.