యానంలో పెరుగుతున్న వరద తీవ్రత
సమీక్షించిన పరిపాలన అధికారి మునిస్వామి
విశ్వంవాయిస్ న్యూస్, యానం:
కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో గౌతమి గోదావరి వరద తీవ్రత ఎక్కువైంది. యానంలో ఫ్రాన్స్ తిప్ప, బాలయోగి నగర్, పాత రాజీవ్ నగర్, సుభద్ర నగర్ పరిసర ప్రాంతాలను పరిపాలన అధికారి సమక్షంలో అప్రమత్తం చేశారు. వరదలలో భాగంగా ఈ ప్రాంతాల్లోకి ఎక్కువ వరద నీరు చేరే అవకాశం ఉంటుందని ముందస్తు చర్యలలో భాగంగా అప్రమత్తం చేస్తున్నట్లు మునిస్వామి తెలిపారు.