—- ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత
—- 40 రోజులపాటు నియోజక వర్గంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గొల్లపల్లి
విశ్వంవాయిస్ న్యూస్, రాజోలు:
రాజోలు నియోజకవర్గంలో ఈ నెల 25 నుండి ప్రారంభం కాబోతున్న మహాశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. తాటిపాక గ్రామంలో జరిగిన నియోజకవర్గ మహిళా కమిటీ సమావేశంలో మాజీమంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు సఖినేటిపల్లి మండలం, అంతర్వేది దేవస్థానం నుండి ప్రారంబించబోతున్నామని ముందుగా దక్షిణ కాశీ గా పేరొందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తున్నారని అన్నారు. రేపటి మహాశక్తి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలియజేసినారు. ఈ కార్యక్రమం రాజోలు నియోజకవర్గంలో నలభై రోజుల పాటు కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లతో బాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారని ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో ను కరపత్రాల ద్వారా ప్రతీ ఇంటి ని సందర్శిస్తామన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు యొక్క పాలన ఆవశ్యకతను తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల భవానీ లావణ్య, బందెల పద్మ, కందికట్ల నిర్మలకుమారి, గెడ్డం పద్మకుమారి, తాడి నాగ దుర్గ, కొత్తపల్లి విజయ, యాలంగి విజయలక్ష్మి, రాయుడు ఈశ్వరి, కడలి పద్మ, కడలి నాగ లక్ష్మి, ఎంపీపీ కేతా శ్రీనివాస్, గుబ్బల శ్రీనివాస్, గుబ్బల శ్రీనివాస్, మొల్లేటి శ్రీనివాస్, సూద బాబ్జి, రుద్రరాజు వెంకటరామరాజు, సాగి పాపయ్యరాజు, సాగి సత్యనారాయణ రాజు, ఈలి శ్రీనివాస్, పామర్తి రమణ, చాగంటి స్వామి, జంపన సత్యనారాయణ రాజు, బొక్కా గోవింద్, పితాని సూరిబాబు, గాలిదేవర వెంకన్నబాబు, గుడాల విశ్వనాథం, గుద్దటి చిట్టబ్బాయ్, నాగిరెడ్డి గోపీ, కట్టా భగవాన్, బైరుశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.