—— గోదావరి మధ్య లంకల్లో ఉన్న మూగజీవాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు..
విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
సాధారణంగా నది తీర ప్రాంతాల్లో రైతులు జీవనశైలి లంక గ్రామాల్లో ఉన్న అంతర పంటలు ,పశుగ్రాసం, పాడిపశువుల పెంపకం, వాటిపై ఆధారపడి ఉంటుంది. వాటి ద్వారా వచ్చే ఆదాయం పైనే కుటుంబ పోషణ గడుపుతుంటారు .ప్రతి ఏడాది వచ్చే వరదల వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఆర్థికంగాను తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు గోదావరి మధ్యలంకలో పండించే కూరగాయలు పశుగ్రాసం వరదనీటిలో కుళ్లిపోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. లంకల్లో ఉన్న పశువులను పడవల ద్వారా ఎగువ ప్రాంతాలకు తీసుకువచ్చి అక్కడనుండి సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పాడి రైతులంతా నిమగ్నమై ఉన్నారు. పాడిపశువులకు ఆహారం కోసం వినియోగించే పశుగ్రాసం ముందస్తుగా సిద్ధం చేసుకుని వాటిని పడవల్లో వేసుకుని నిల్వచేసుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. గతంలో వరదల దృష్ట్యా పశుగ్రాసం కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఈ వేసవిలో ఎండు గడ్డిని ముందస్తుగా సేకరించి వాటిని వరదల్లో ఇబ్బందులు పడే పాడి రైతులకు అందజేయాలని నిర్ణయించింది కాగా అధికార యంత్రాంగం ఎంత మేర ఎండు గడ్డిని సేకరించిందో…. వాటిని ఎంతమందికి పంపిణీ చేస్తుందో …. వేచి చూడాల్సి ఉంది.