వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఆర్డీవో
విశ్వంవాయిస్ న్యూస్, యానం:
వరదల నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతమైన యానం ప్రాంతంలో గోదావరి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం సముద్రానికి అతి సమీపం కావడంతో వచ్చే వరద నీరు వల్ల సముద్రంలోకి వెళ్లే వరద నీరు కొన్నిసార్లు వేగం తగ్గుతూ వెళ్లడం వల్ల నీటిమట్టం పెరుగుతుండటంతో యానం పరిసర ప్రాంతాలలో రాజీవ్ గాంధీ బీచ్ మరియు యానంలోని కొన్ని వీధులు సైతం ముప్పు బారిన పడుతున్నాయి. ప్రస్తుతం చూసినట్లయితే శుక్రవారం నీటిమట్టాన్ని చూస్తే వరద పెరుగుతున్నప్పటికీ రాజీవ్ గాంధీ బీచ్ మునిగేంత వరకు ఇప్పటికీ నీరు చేరుకుంది. అయితే రానున్న కొన్ని గంటల్లోనే నీటిమట్టం పెరిగి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం వచ్చే వరదల సమయంలో స్థానిక గోదావరి కి సమీపంలో ఉన్న భవనాలు కొన్ని వీధులు జలమయ వుతాయి. క్రిందటి సంవత్సరం చూసినట్లయితే ఈరోజు ఉన్న నీటిమట్టానికి కొంత మేరకు మార్కెట్ రోడ్డు వరకు నీరు వచ్చేసిన సందర్భం ఉండేది. ఇలా నీరు చేరకుండా కొంతమేరకు గడచిన సంవత్సరంలో కొన్నిచోట్ల నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజీ లైన్ వ్యవస్థని కట్టుదిట్టం చేయడం వల్ల ఇంతవరకు యానంలోకి నీరు రాకుండా అడ్డుకోగలిగారు. రాజీవ్ బీచ్ సముదాయంలో నీరు పెరిగితే మాత్రం నీటి దాటికి యానంలోకి ప్రవహించే అవకాశాలు ఎక్కువ. సంబంధిత అధికారులు పాలకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నాయకులు కూడా ప్రచారం మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.