విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
సత్యం, ధర్మం, న్యాయం, కోసం 72 మంది పరివారంతో పాటు తన ప్రాణాలను సైతం అర్పించిన ముస్లింల ఆరాధ్య దైవం హజరత్ ఇమామ్ హుస్సేన్ కి గురువారం ముస్లింలు ఘనంగా నివాళులర్పించారు.
ఇమామ్ హుస్సేన్ ఆర్బయీన్ (అమరత్వం పొందిన 40వ రోజు) సందర్భంగా గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహించారు. నగరం బడేబీబీ పంజాలో ఈ సందర్భంగా మజ్లిస్ జరిగింది. గుర్రంపై పీరును ఊరేగిస్తూ మాతం నిర్వహించారు.
మంజిలే కర్భులాలో గురుహే తాజారే పురాత్ భక్త బృందం ఆధ్వర్యంలో అర్బయీన్ కార్యక్రమం జరిగింది. కత్తులు, బ్లేడులతో తమ శరీరాలను గాయపర్చుకుంటూ “హుస్సేన్… హుస్సేన్… అని నినదిస్తూ రక్తం చిందించారు. నగరం పంజీషా వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం మామిడికుదురు వరకు పీరును ఊరేగించారు.
హజరత్ అబ్బాస్ పంజాలో కూడా మజ్లిస్ జరిగింది. పలు భక్త బృందాలు భక్తులకు ప్రసాదాలు వితరణ చేశాయి. వేల సంఖ్యలో ముస్లింలు అర్చయీన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. .