విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
మామిడికుదురు మండలం నగరం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు , నగరం గ్రామ శాఖ అధ్యక్షుడు జాలెం సుబ్బారావు ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసినందుకు ఈ దీక్ష చేపట్టానని తెలిపారు. జాలెం సుబ్బారావు కు మద్దతుగా నగరం గ్రామ సర్పంచ్ జాలెం రమణ కుమారి, వార్డు సభ్యులు కోళ్ల సురేష్ బాబు తో పాటు పలువురు నాయకులు ఈ దీక్ష లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుబ్బారావు మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్ వచ్చేవరకు ఈ దీక్ష కొనసాగుతుందని, శాంతియుతంగా మా నాయకుడిని మేము కాపాడుకుంటామని అన్నారు. చంద్రబాబు మచ్చ లేని మహా నాయకుడని, లేని పోని ఆరోపణలు చేస్తూ అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతుందని అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసులో చంద్రబాబు నాయుడు పేరు లేనప్పటికి ఆయన్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైస్సార్సీపీ కి ప్రజలు తగిన గుణ పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పాద యాత్రలో భాగంగా నారా లోకేష్ పొదలాడ లో ఉన్నారని, తండ్రి అరెస్ట్ విషయం తెలుసుకుని విజయవాడ బయలుదేరుతుంటే పోలీసులు అడ్డు పడటం ఎంత వరకు సమంజసమని సుబ్బారావు నీలాదీశారు. నిరాహారదీక్ష చేస్తున్న సుబ్బారావు కు మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్, నాయకులు బొంతు మణిరాజు, చుట్టుగుళ్ళ కిషోర్,సుధా బాబ్జీ,ఇంటి గణపతి తో పాటు పలువురు టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు.