WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

రెండవ రోజుకు చేరిన జాలెం సుబ్బారావు ఆమరణ నిరాహార దీక్ష

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ పి. గన్నవరం నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు, మరియు టిడిపి నగరం గ్రామ శాఖ అధ్యక్షులు జాలెం సుబ్బారావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంతో రెండో రోజుకు చేరుకుంది. చంద్రబాబు నాయుడు తక్షణమే విడుదల చేయాలని,బెయిల్ వచ్చే వరకు తన పోరాటం కొనసాగుతుందని సుబ్బారావు తెలిపారు.. తనకు అన్ని విధాలా సహకరిస్తున్న పార్టీ శ్రేణులు,మండల పార్టీ నేతలు ,నియోజకవర్గ నాయకులు సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు.చంద్రబాబు పై ఉన్న అపారమైన అభిమానం తోనే ఆమరణ నిరహార దీక్షకు సిద్ధపడ్డానని జాలెం సుబ్బారావు మీడియాకు వివరించారు.కేవలం కక్ష సాధింపు చర్యల్లో బాగంగానే అక్రమ అరెస్టులు చేశారని, ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే అని ఏద్దేవా చేశారు.సోమవారం నగరంలో ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సుబ్బారావుకు మండల జనసేన పార్టీ సంఘీభావం తెలిపింది.ఆ పార్టీ అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా ఆధ్వర్యంలో జనసేన నాయకులు భారీగా తరలివచ్చి సుబ్బారావుకు సంఘీభావాన్ని ప్రకటించారు.వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.తక్షణమే చంద్రబాబు ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొమ్ముల కొండల రావు, ఎంపీటీసీలు వాసంశెట్టి రమణ, చెరుకూరి సత్తిబాబు , ఉప సర్పంచ్ తుండూరి బుజ్జి, బొంతు శేఖర్,కొమ్ముల భద్రం, అడబాల చిన్ని, రుద్రా శ్రీను,బళ్ళ సతీష్,వీధి సత్తిబాబు, కాట్రేనిపాడు నాగేంద్ర, గుల్లింక గంగాధర్,సర్కిల్ రాజా అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement