తాళ్లరేవు తహసిల్దార్ కార్యాలయం వద్ద దళిత నాయకుల నిరసన
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం జల్లావారిపేట పేట గ్రామంలో 50 సెంట్లు భూమిని కాకినాడకు చెందిన ఒక వ్యక్తి తనదని ప్రైవేటు వ్యక్తుల ద్వారా సర్వే చేయించడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల ప్రకారం సదరు కాకినాడకు చెందిన వ్యక్తి జిల్లా వారి పేటకు చెందిన 50 సెంట్లు గ్రామ కంఠం భూమిని ఆ స్థలం తనదంటూ చెప్పుకోవడంతో గ్రామస్తులు దళిత నాయకులతో కలిసి తాళ్లరేవు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి తమ గ్రామానికి చెందిన గ్రామ కంఠం భూమిని ఆక్రమిస్తున్న వ్యక్తుల నుంచి భూమిని కాపాడాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలిసి తహసిల్దార్ కు వినతిపత్రం అందించారు. దళిత నాయకులు మాట్లాడుతూ దళిత గ్రామమైనటువంటి జిల్లా వారి పేటకు చెందిన భూమిని కాకినాడ నుండి వచ్చిన వ్యక్తి ఆక్రమించడం సరైంది కాదని, ఆ వ్యక్తి నుండి భూమిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి. రమేష్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు ,వల్లు రాజబాబు, మందనక్క తణుకురాజు ,దళిత నాయకులు జల్లా వారి పేట గ్రామ పెద్దలు పాల్గొన్నారు.