విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
ఎమ్మెస్ స్వామినాథన్ ఆశయాలుప్రభుత్వాలు అమలుచేయాలిఅని తాళ్ళరేవు ప్రజాసంఘాల భవనంలో ఏపీ కౌలు రైతుసంఘం మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెస్ స్వామినాథన్ సంస్మరణ సభ ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లి రాజబాబు అధ్యక్షతన జరిగింది ముందుగా శివన్నారాయణ మరియు ఉంగరాల వెంకటేశ్వరరావు స్వామినాథన్ ఫోటోకు పూలమాల వేశారు అనంతరం అందరూ సంతాపం తెలియజేశారు ఈ సమావేశంలో ఎమ్మెస్ స్వామినాథన్ పాత్ర భారతదేశంలో చాలా కీలకమైనది ఈరోజు భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా సంఘాల నాయకులు అన్నారు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ మాట్లాడుతూ భారతదేశంలో 36 కోట్లు జనాభా ఉన్న సమయంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందని భవిష్యత్తులో భారత దేశంలో జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ తిండి గింజలు దొరికే విధంగా అనేక పరిశోధనలు స్వామినాథన్ చేసి కొత్త వరి వంగడాలు సృష్టించి ఈ దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు తిండి గింజలు సప్లై చేసే విధంగా స్వామినాథన్ పనిచేశారన్నారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాలు స్వామినాథన్ సేవలను గుర్తించాయని భారత దేశంలో మన ప్రభుత్వం తగినంత గుర్తింపు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు రాజబాబు మాట్లాడుతూ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెస్ స్వామినాథన్ గారితో కమిషన్ వేయించిందని ఆ కమిషన్ లో పెట్టుబడి పై 50% గిట్టుబాటు ధర పెంచి ఇవ్వాలని వ్యవసాయ రంగంపై అనేక సూచనలు చేసి ప్రభుత్వానికి సమర్పించిన నేటికీ అవి అమలు జరగలేదని అందుకనే వ్యవసాయం సంక్షోభంలో ఉందని రైతు ఆత్మహత్యలు పెరిగాయని గిట్టుబాటు ధరలు ఎరువులు పురుగు మందులపై సబ్సిడీలు కుదించడం మార్కెట్ సౌకర్యం సరిగా లేకపోవడం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవసాయంపై సవతి తల్లి ప్రేమ చూపించడం వల్ల వ్యవసాయం నష్టం లో ఉందని ఎమ్మెస్ స్వామినాథన్ ఆశయాలు ప్రభుత్వాలు అమలు చేయాలని యువత వీటిపై ఆలోచన దృష్టి సారించాలని ఆయన కోరారు ఉంగరాల వెంకటేశ్వరరావు గారు వడ్డీ ఏడుకొండలు గారు బర్రె బుజ్జిబాబు ప్రకాష్ కాలేజీ లెక్చరర్ కడల శ్రీనివాస్ శ్ గారు పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ గుత్తుల మల్లేశ్వరరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎడ్ల కుటుంబరావు చొల్లంగి కుమార్ సిహెచ్ సంతోష్ కడలి శ్రీనివాస్ పలివెల సింహాచలం దడాల అబ్బులు ఎన్ గోవిందు పంచగల రామకృష్ణ ఎస్ రాంబాబు మరియు కౌలు రైతులు పాల్గొన్నారు