Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జిల్లాలో ఘనంగా పోలీసుల సంస్మరణ దినోత్సవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం టౌన్:

కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్.

 

అమలాపురం విశ్వం వాయిస్ ఎస్పీ కార్యాలయం న్యూస్

 

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ ఎస్ శ్రీధర్ ఘన నివాళులు అర్పించారు. శనివారం ఉదయం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, అమలాపురం మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అడిషనల్ ఎస్పీ ఖాదర్బాషా, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ముందుగా మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు..తర్వాత అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అతిధులు మాట్లాడారు.

 

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ

1959, లడక్ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ సరిహద్దును పరిరక్షిస్తున్న భారతదేశ పోలీసుల మీద చైనా బలగాలు చేసిన దాడిలో పది మంది పోలీసులు దుర్మరణం పాలయ్యారని నాటి నుంచి విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ రోజు దేశ ప్రధాని మొదలు, రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం వారి మరణానికి విచారం వ్యక్తం చేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. దేశ సరిహద్దులను కేంద్ర పారా మిలిటరీ బలగాలు రక్షిస్తే దేశ అంతర్గత భద్రత విషయంలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గడిచిన సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా 188 మంది పోలీసులు వివిధ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారని , వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ..

 

1959 అక్టోబర్ 21న లడక్ లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద గస్తీ కాస్తున్న భారతదేశ పోలీసుల మీద చైనా బలగాలు చేసిన కాల్పులలో పదిమంది పోలీసులు మరణించారని వీరి జ్ఞాపకార్థం మరియు విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు.దేశాన్ని కాపాడే వారు సైనికులు అయితే సమాజంలోని అంతర్గత శక్తుల నుంచి ప్రజలను కాపాడి వారి ధన ప్రాణాలకు భద్రత కల్పించేది పోలీసులన్నారు.

 

ప్రస్తుత పరిస్థితులోపోలీసులు లేని సమాజాన్ని అసలు ఊహించలేమని,ఏ వ్యవస్థ అయినా సాఫీగా నడవాలంటే పోలీసుల పాత్ర ఎంతో కీలకమన్నారు .పోలిసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ సమస్యలు, హింసాత్మక సంఘటనలు, లైంగిక దాడులు, మద్యం, డ్రగ్స్ నేరాలు, సైబర్ నేరాలు ఇలా రక రకాల సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు.

ఇలా ప్రజలకు సేవలందిస్తూ విధి నిర్వహణలో కొంత మంది పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారని , ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శాంతిభద్రతలను నిరంతరం పరిరక్షిస్తూ సమాజంలోని అసాంఘిక శక్తులను దీటుగా ఎదుర్కొని ప్రజలందరికీ సేవలు అందిస్తున్న జిల్లా ఎస్పీ నేతృత్వంలోని పోలీసులు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

 

 

జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ..

పోలీసు యూనిఫామ్ ధరించిన ప్రతి వ్యక్తి కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ రోజు ను స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే పోలీసు ఉద్యోగం అనేక సవాల్లతో కూడుకున్నదని, సమాజంలో ప్రజలు శాంతిభద్రతులతో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే దానికి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న పోలీసులే కారణమన్నారు. యూనిఫామ్ ధరించిన పోలీసులు గర్వంగా పనిచేస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఈ సంవత్సరంలో జరిగిన రెండు ముఖ్యమైన సంఘటన ప్రస్తావించారు. గత మే నెలలో యానం- ఎదురులంక వారధి పైనుంచి ఒక మహిళ గోదావరి నదిలో దూకిన సంఘటనలో అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నదిలో దూకి ఆ మహిళ ప్రాణాలు కాపాడాడని, అదేవిధంగా రావులపాలెం బ్రిడ్జి మీద ఒక పాప అర్ధరాత్రి పూట వేలాడుతూ ఉందని సమాచారం అందగానే వెంటనే వెళ్లి ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లా లో వరదలు సంభవించిన సమయంలో, బందోబస్తు లలో పోలీసులు అందించిన సేవలను ఆయన కొనియాడారు. పోలీసులు రాత్రి పగలు పనిచేయాలంటే వారి కుటుంబ సభ్యుల సహాయం ఎంతో అవసరమని, పోలీసులు అహర్నిశలు పనిచేయడంలో వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

అతిథులు మాట్లాడిన తర్వాత గడచిన సంవత్సర కాలం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన ముగ్గురు పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ప్రాణాలు విడిచిన వి ఎస్ సాయి బాబా కుటుంబ సభ్యులకు గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం పోలీసుల అమరవీరుల దినోత్సవ సందర్భంగా పోలీసులు నిర్వహిస్తున్న ర్యాలీనీ జండా ఊపి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement