తామాడ సౌజన్య రాజకుమారి సహా 50 మంది మహిళలు పార్టీలోకి
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
చంద్రబాబుకి మనమంతా అండగా ఉండాలి
రాజమండ్రిలో 29వ డివిజన్లో టీడీపీ లో చేరికలు
తామాడ సౌజన్య రాజకుమారి సహా 50 మంది మహిళలు పార్టీ లోకి తీర్థం
– ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ కండువా వేసి ఆహ్వానం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
రాజకీయాల్లో 45 ఏళ్లు అనుభవం, ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేసి ఎటువంటి అవినీతికి పాల్పడని చంద్రబాబు నాయుడిపై జగన్ ప్రభుత్వం కావాలని కుట్ర చేసి జైలులో ఉంచిందని, ఇటువంటి కష్టకాలంలో చంద్రబాబు నాయుడికి మనమంతా అండగా ఉండి, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తామాడ సౌజన్య రాజకుమారితో పాటు 50 మంది మహిళలు, యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ తదితరులు పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్, కాశి నవీన్ కుమార్,
తామాడ సౌజన్య తదితరులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ నిరంకుశ పాలన నచ్చక, చంద్రబాబు నాయుడుకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని, పార్టీలో చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు. ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైలులో పెట్టి ఇప్పటి 45 రోజులు గడిచిందన్నారు. ఏ తప్పు చేయకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసి జైల్లో ఉంచడం అన్యాయమన్నారు. సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కోశాధికారి శెట్టి జగదీష్, కార్యనిర్వాహక కార్యదర్శి మర్రి దుర్గా శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, బీసీ సెల్ కార్యదర్శి సప్పా వెంకట రమణ, నాయకులు కిలారి వెంకటేశ్వరరావు, రుంకాని విజయ్, అట్టాడ రవి, కర్రి సతీష్, ఈశ్వరి, లక్ష్మి, తామాడ హరిత, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.