విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
తక్కువ ధరకే నాణ్యత గల క్రీడా దుస్తులను క్రీడాకారులకు అందించనున్నట్లు ‘బుల్ రేజ్ స్పోర్ట్స్ వేర్’ ఫౌండర్, సీఈవో మహ్మద్ అఫ్జల్ వెల్లడించారు. స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ సమీపంలో డీజే స్వీట్స్ ఎదురుగా ‘బుల్ రేజ్ స్పోర్ట్స్ వేర్’ లైఫ్ స్టైల్ ఈనెల 30వ తేదీ సోమవారం గ్రాండ్ గా ప్రారంభిస్తున్న సందర్బంగా ఆదివారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వియత్నాం, తైవాన్ నుంచి క్లాత్ దిగుమతి చేసుకుని కోయంబత్తూరులో జిమ్ సూట్ తో సహా అన్ని రకాల క్రీడా దుస్తులు తయారు చేసి షోరూం ల ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. సొంతంగా రూపొందిస్తున్న బ్రాండ్ కారణంగా అత్యంత నాణ్యత ఉండేలా శ్రద్ధ తీసుకుంటున్నా మన్నారు. మిగిలిన బ్రాండెడ్, మల్టీ బ్రాండెడ్ ఉత్పత్తుల కన్నా తమ దగ్గర మూడవ వంతు ధరలకే లభిస్తాయని అఫ్జల్ చెప్పారు. లాభం కంటే నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని అఫ్జల్ తెలిపారు. బెంగుళూరు , హైదరాబాద్ వంటి మెట్రో సిటీస్ లో షోరూం లు ప్రారంభించాలని భావించినప్పటికీ పుట్టి పెరిగిన రాజమండ్రిలో ముందుగా ప్రారంభించాలన్న ఉద్దేశ్యంతో మొదటగా ఇక్కడ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఆన్ లైన్ లో సేల్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు. షోరూం ఇంచార్జి వేముల మురళి కృష్ణ, నిర్వాహకులు అజయ్ , శరత్, ప్రకాష్, వంశీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.