విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
ద్రాక్షారామ రోడ్ వెయ్యడం పై హార్షం వ్యక్తం చేసిన యాట్ల నాగేశ్వరావు
విశ్వం వాయిస్ రామచంద్రపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా
రామచంద్రపురం నియోజకవర్గంలో ద్రాక్షారామ నుండి రామచంద్రపురం రోడ్డు పనులు మొదలు పెట్టడం వలన ఈ రోడ్డుకు మోక్షం కలుగుతుందని నియోజకవర్గం మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు.రోడ్డు వేయ్యా లని అధికారులను డిమాండ్ చేసిన మొట్ట మొదటి వ్యక్తి ని నేనని తర్వాత పార్టీలకు అతీతంగా గతంలో ర్యాలీ నిర్వహించామని.కొన్ని రోజులు తర్వాత అఖిలపక్షం తో ధర్నా నిర్వహించే సమయానికి జీఓ నెంబర్ ఒకటి ద్వారా ఉద్యమాన్ని ఆపివేసారు.ఆతర్వాత ఎవరూ పట్టించుకోలేదు.రోడ్డు మీద ఉన్న గుంతల్లో పడి ఎంతోమంది వాహన దారులు గాయాలు పాలై నారు.వారి యొక్క ఆవేదనకు స్పందించి రోడ్డు మీద గుంతలు పూడ్చండి, ప్రజలు ప్రాణాలు కాపాడండి అని ఎన్నో సార్లు నేను ప్లకార్డుతో నిరసనలు చేపట్టానని. మరియు రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం లో జగనన్నకు చెపుదాం అనే కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి వినతి పత్రం ఇచ్చి రోడ్డు వేయాలని కోరగా ఎటువంటి స్పందన లేకపోవడంతో రోడ్డు వేయ్యని పక్షంలో తామంతా సొంత కర్చులతో గుంతలు పూడ్చుకొనుటకు అనుమతి ఇవ్వాలని ఆర్డీఓ వారిని కోరగా అనుమతి ఇచ్చేందుకు కాలయాపన చేశారు.అప్పుడు రోడ్డు భవనాలు శాఖఅధికారులు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,డివిజనల్ ఇంజనీర్ వారితో ఎన్నో సార్లు మాట్లాడానని. సంబందిత పై అధికారులు కు ఫిర్యాదు చేయగా వారి వత్తిడి వల్లనే నేటికి ఈ రోడ్డుకు మోక్షం కలిగిందని యాట్ల అన్నారు.పోరాటం తోనే ఏదైనా సాధించగలమని రుజువు చేశానని.దాదాపు ఐదు సంవత్సరాలు నుండి రోడ్డు సమస్య పట్టించుకోని అధికారం,ప్రతిపక్షాలకు ఇప్పుడు రోడ్డు సమస్య గుర్తుకు రావడం శుభ పరిణామం అని త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రోడ్డు వేయాలని గుర్తుకు వచ్చిందని.రోడ్డు వేయడం వలన నియోజకవర్గం ప్రజలకు రోడ్డు యెక్క బాధ నుండి విముక్తి కలుగుతుందని అన్నారు.నియోజకవర్గం లో కాజులూరు,గంగవరం మండలాలులో పలు చోట్ల రోడ్లు పరిస్టితి అధ్వానంగా ఉన్నాయి.కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగిలిన రోడ్లు వేయాలని కోరారు.నా యెక్క విన్నపాన్ని స్పందించి రోడ్డు పనులు మొదలు పెట్టిన అధికారులకు యాట్ల కృతజ్ఞతలు తెలిపారు.