బడుగు బలహీన వర్గాల ఆశాజోతి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘననివాళి
విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
అంగన్వాడీ వర్కర్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 67 వర్ధంతి ఘననివాళి
విశ్వం వాయిస్ రామచంద్రపురం అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర కమిటి పిలుపు లో భాగం గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67 వ వర్ధంతి పురస్కరించుకుని రామచంద్రపురం మండలం లో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ గా అంబేద్కర్ పూలమాలవేసి నివాళి లు అర్పించారు.తదుపరి అంగన్వాడీలు తమ డిమాండ్స్ కరపత్రాన్ని అంబేద్కర్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం, అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి దుర్గాంబ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల మీద అనేకమార్లు ధర్నాలు,నిరాహార దీక్షలు, నిరసనలు తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని తమ న్యాయమైన డిమాండ్ల కోసం డిసెంబర్ 8 నుండి సమ్మెలోకి వెళ్తున్నామని అన్నారు. డిమాండ్స్ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతాను అన్న సీఎం ఇచ్చిన మాటని వెంటనే నిలబెట్టుకోవాలని. సుప్రీంకోర్టుతీర్పు ప్రకారం గ్రాడ్యుడి అమలు చేయాలని,రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని,వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని,మినీ సెంట్రల్ ను మెయిన్ సెంట్రల్ గా మార్చాలని, మెయిన్ వర్కులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని,హెల్పర్ల ప్రమోషన్లకు వయో పరిమితి యాబై సంవత్సరాలు పెంచాలని.ప్రమోషన్ లో రాజకీయ జోక్యం అరికట్టాలని,ఎఫ్.ఆర్.ఎస్ రద్దు చేయాలి.అన్ని యాప్ ను కలిపి ఒకే యాప్ గా మార్చాలని,సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి,బీమా అమలుచేయాలని,లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని.ప్రీస్కూల్ బలోపేతం చెయ్యాలి అని మరియు వేతనంతో కూడిన మెడికల్ లివ్ ఇవ్వాలి అని అన్నారు.ఈకార్యక్రమంలో అంగన్వాడి నాయకులు వి.సూర్యకుమారి,జహర, విజయలక్ష్మి,కే.దుర్గ,భవాని,సీత,ప్రశాంతి మరియు వర్కర్స్ పాలుగున్నారు.