విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది.
స్థానిక తిలక్ రోడ్డులోని గుంటూరు
ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ యూనివర్శిటి ప్రొఫెసర్ డాక్టర్ యమ్ గోపాలకృష్ణ ప్రదర్శన ప్రారంభించారు.విద్యార్ధులు ప్రదర్శించిన వివిధ రకాల సోషల్ ఎక్స్పో నీ సందర్శించి ఆయన విద్యార్థుల ప్రతిభను అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి.
ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి, వారిలో కొత్త ఆలోచనలను అభివృద్ది చెందడానికి, సైన్స్ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం పెంపొందించు కోవడానికి దోహదపడతాయని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ఐ.వి.సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతివిషయాన్ని ప్రాజెక్టుల ప్రదర్శన ద్వారా అందరికీ తెలిసేలా వివరించటం ద్వారా వారిలోని నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఈ ప్రదర్శన ఉపయోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆక్స్ ఫర్డ్ స్కూల్ సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.