విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ:
- కాకినాడ జిల్లా కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నిన్న కాకినాడ కలెక్టరేట్లో జరిగిన విషయాలు బాపూజీ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 101 మంది కాలీలలో గ్రేడ్2 విఆర్వోలకు గ్రేడ్1 వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించడం పట్ల వీఆర్వో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల విఆర్వోల అధ్యక్షులు మద్దాల బాపూజీ హర్షం వ్యక్తం చేశారు.గ్రేడ్2 గ్రామ రెవిన్యూ అధికారులకు గ్రేడ్ 1 వీఆర్వో పదోన్నతి కల్పించుటకు జిఓ 166 సాదించుటలో మరియు జిఓ అమలు చేయుటకు ఎంతగానో కృషి చేసిన వీఆర్వో ల రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తూ,
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గ్రేడ్ 2 గ్రామ రెవిన్యూ అధికారులకు సీనియరిటీ లిస్ట్ పబ్లికేషన్ చేయించుటలో పలుమార్లు కాకినాడ కలెక్టరేట్ వెళ్లి ఉన్నత అధికారులతో మాట్లాడి ఎంతగానో కృషి చేసిన కాకినాడ గ్రామ రెవిన్యూ అధికారుల జిల్లా అధ్యక్షులు కే వి వి సత్యనారాయణ మరియు జిల్లా ఉపాధ్యక్షుడు అనిశెట్టి రామకృష్ణ, కాకినాడ డివిజన్ సెక్రెటరీ కిషోర్, గ్రేడ్2 వీఆర్వోల నాయకులు అయిన శేఖర్,తాతారావు,శ్రీదేవి, సత్యవేణి,శేషగిరిరావు, నాగేశ్వరరావులకు అభినందనలు తెలియచేస్తున్నాము అని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో మద్దాల బాపూజీ,రాష్ట్ర ప్రచార కార్యదర్శి,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వీఆర్వోల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.